సంక్షేమ హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలి – కాస్మోటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి కెవిపిఎస్ డిమాండ్
రాయల్ పోస్ట్ ప్రతిదీ :నారాయణఖేడ్
సంక్షేమ హాస్టల్స్ సర్వేలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు డిమాండ్ చేశారు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలని పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్ బిల్లులు వెంటనే చెల్లించాలనీ.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు డిమాండ్ చేశారు.* పట్టణం లోని జూకల్ శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సందర్శించి సర్వే చేయడం జరిగింది అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది.మరియు ఇతర సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులతో ముఖాముఖి సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కోటారి నర్సింలు మాట్లాడుతూ జిల్లాలో నేటి వరకు హాస్టల్ విద్యార్థులకు బట్టలు చెప్పులు బూట్లు పెట్టెలు ప్లేటూ గ్లాసూ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకొక విదంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన సామాగ్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి 33 రూపాయల 66 పైసలు, 8వ తరగతి లోపు విద్యార్థికి 30 రూపాయల చొప్పున ప్రభుత్వం మెస్ బిల్ ఇవ్వడంతో చాలీచాలని అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో ప్రస్తుతం ఇస్తున్న ఈ డబ్బులతో పిల్లలు రెండు పూటల భోజనం ఎలా చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.
జిల్లాలో మెనూ సక్రమంగా పాటించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు కొరవడుతున్నాయి వాటిని సరిచేసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం తీసుకోవాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా యస్సీ యస్టీ బిసీ సంక్షేమ హస్టల్స్ సర్వేలు నిర్వహించి వచ్చిన సమస్యలు జిల్లా కలెక్టరు గారికి వినతిపత్రం ఇచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు యస్,గణపతి,యం.మోషప్ప.జిసంజివులు, పేరెంట్స్ కమిటీ బాధ్యులు రాజ్ నాయక్,సంజివు కూమార్ లు తదితరులు పాల్గొన్నారు.