ప్రమాదకరంగా మారిన భువనగిరి పట్టణ ప్రధాన రహదారులు పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాస్తారో ధర్నా

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భువనగిరి పట్టణ ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమై గుంతల మయమై దుమ్ము దులితో ప్రజలు నాన్న అవస్థలకు గురవుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ అండ్ బి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆరుమూరుల కల్వర్టుపై రాస్తారో ధర్నా నిర్వహించడం జరిగింది ఈసందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం పట్టణ ప్రధాన రహదారులు సంవత్సర కాలం నుండి పూర్తిగా ధ్వంసమై ఎక్కడ పడితే అక్కడ గుంతల మయమై ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు కోల్పోతూ ప్రజలు త్రీవ ఇబ్బందులు గురవుతున్న కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్ అండ్ బి అధికారులు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య కారణంగా రోడ్లన్నీ గుంతల మాయమైపోతే నేటికి కూడా చోద్యం చూస్తున్నారని మొద్దు నిద్ర పోతున్నారని ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, భువనగిరి పెద్ద చెరువు సంబంధించిన హైదరాబాద్ రోడ్డు అలుగు తాతా నగర్ అలుగు నీళ్లు పొంగిపొర్లుతున్న కూడా ఆర్ అండ్ బి రోడ్లపైకి వచ్చి తాతానగర్ లో రైతుల పంట పొలాలు అన్ని నీళ్లలో మునిగిపోయి రైతులు నష్టపోతున్న కూడా అదేవిధంగా ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి చేస్తున్న పనులు సంవత్సర కాలం పూర్తి కావస్తున్న రోడ్లు అన్ని గుంతల మాయమై గురు నిలయం హౌసింగ్ బోర్డు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ జగదపూర్ చౌరస్తా జగ్జీవన్ రామ్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నలగొండ రోడ్డు లో కిల్లనగర్ కాజి మెహళ్ళ పోచమ్మ వాడ రాంనగర్ ప్రాంతాలలోని రోడ్లు అన్నీ దెబ్బతిన్న పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా వెంటనే యుద్ధ ప్రాతిపరంగా రోడ్లకు మరమ్మత్తుల పనులను చేపట్టాలని వారం రోజులలో గుంతలమైన రోడ్లకు మరమ్మతులు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్ కైరం కొండ వెంకటేష్ ఈరపాక నరసింహ వడిచర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ మాజీ ఎంపీపీ ఎర్ర శ్రీరాములు పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జిట్ట మల్లారెడ్డి మాదాస్ గోవర్ధన్ చాంద్ రాములు నాయక్ ఓబిసి విభాగం నాయకులు మల్లేష్ యాదవ్ జిల్లా కార్యదర్శి సిరిపంగా చందు దాసరి మధు నరసింహ రషీద్ చాంద్ దాబా శీను గజ్జి రాజు రాసాల గణేష్ సైఫ్ మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది