రాయల్ పోస్ట్ ప్రతినిధి

గుమ్మడిదల మండలం తాసిల్దార్ కార్యాలయానికి ఇంటి అద్దె చెల్లించడం లేదని భవన యజమానులు తాళం వేసిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది నూతనంగా ఏర్పాటైన గుమ్మడిదల మండల కేంద్రానికి సొంత భవనం లేక కిరాయి భవనంలో రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి గత ఏడు సంవత్సరాల నుండి ఇంటి కిరాయి ఇవ్వడం లేదని భవన యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా కిరాయి ఇవ్వడం లేదని భవనానికి తాళం వేయగా కొద్ది మొత్తంలో కిరాయి చెల్లించారని ఎమ్మార్వోలు మారుతున్న కిరాయి మాత్రం చెల్లించడం లేదని దీంతో సహనం కోల్పోయిన భవన యజమానులు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తాసిల్దార్ కార్యాలయానికి తాళం వేశారు దీంతో స్పందించిన అధికారులు కిరాయి డబ్బులు అందేలా చూస్తామని అధికారులు తెలిపారు తాసిల్దార్ కార్యాలయానికి కిరాయికి ఇచ్చి గత ఏడు సంవత్సరాల నుండి అద్దె వసూలు గాక తీవ్ర మానసిక వేదకు గురవుతున్నామని మాకు వయవృద్ధులైన తల్లిదండ్రులకు మాకు ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు కాలేదని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా కులవృత్తులు సైతం ఆదరణ లేదని మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు నాయకులు ఎలాంటి సహకారం లేకపోయినా కనీసం మా ఇంటి కిరాయిని చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు