జియో ఫైబర్ నెట్ వర్క్ కార్మికుడు మృతి
రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీలో పటేల్ కంపెనీ దగ్గర జియో ఫైబర్ నెట్ వర్క్ కార్మికుడు ఒకరు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ మృతుడికి కనీసం నెత్తికి హెల్మెట్, చేతికి గ్లౌజులు గాని మరియు సేఫ్టీ షూస్ కూడా లేకుండా పని చేస్తూ మృతి చెందడం జరిగింది. దీనికి పూర్తిగా యజమాన్యం తోపాటు కాంట్రాక్ట్ పైన చర్య తీసుకోవాలని మృతిచెందిన కార్మికుడికి న్యాయం చెందాలని కోరుతున్నాను. మరి ముఖ్యమైన విషయం ఏమనగా మేడ్చల్ మున్సిపాలిటీ లో జియో ఫైబర్ నెట్ వర్క్ వాళ్లు ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ గుంతలు తీసి పోల్స్ పాతడం జరిగింది. దీనిపై స్థానిక కౌన్సిలర్స్ అభ్యంతరం తెలిపిన పట్టించుకోకుండా పోల్స్ వేస్తూ మాకు మున్సిపల్ పర్మిషన్ ఉందని చెప్పడం జరిగింది.
గుంతలు తీసే సమయంలో డ్రైనేజ్, నీళ్ల పైప్ లైన్ మరియు గ్యాస్ లైన్ పైపులు కూడా డామేజ్ చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించాలని మేడ్చల్ మున్సిపాలిటీ లో మొత్తం ఎన్ని జియో సైబర్ పోల్స్ కి పర్మిషన్ ఉన్నాయి ఎన్ని పోల్స్ కి పర్మిషన్ లేవో తెలియజేయాల్సిందిగా మనవి.