గురుకులాలో వసతులు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైస్సార్.టి.పి జిల్లా అధ్యక్షులు- అతహర్

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాల లో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడం విచారకరం అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ మండి పడ్డారు. ఈ సందర్భంగా భువనగిరి కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అతహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగ చెప్పుకుంటున్న మైనారిటీ గురుకుల పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు.గురుకులాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.కాగజ్ నగర్ గురుకులంలో గత రెండు మూడు రోజులుగా అన్నం లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నప్పటికి పట్టించుకోకుండా అదే అన్నం వడ్డించడంతో తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మైనారిటీ గురుకులాలు నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ లను మోసం చేస్తుందని అన్నారు. తమ పిల్లలకు అయితే ఇదే విధమైన ఆహారం తినిపిస్తారా అనేది ఒక్కసారి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆత్మ విమర్శణ చేసుకోవాలని తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టర్ లు తమ జిల్లాల లో కల మైనారిటీ గురుకులాలను నెలలో ఒక్కసారి అయినా సందర్శించి సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచి అన్ని సంక్షేమ వసతి గృహాలలో, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాల లలో మంచి పౌష్టిక ఆహారాన్ని అందచేయవలసిన అవసరం ఉందని అతహర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా నాయకులు షకీల్, వాహేద్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు…