ఖమ్మం జిల్లా…

వల్లభిలో దారుణం….

లిప్ట్ అడిగి… ఇంజక్షన్ ఇచ్చి… ప్రాణాలు తీసిన అగంతకుడు
అక్కడిక్కడే చనిపోయిన షేక్ జమాల్ సాహెబ్

వల్లభిలో అనూహ్య రీతిలో హత్య జరిగింది.. సంచలనం రేకెత్తించిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి….. బిడ్డ వద్దకు వెళ్తున్న చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన వ్యక్తిని లిఫ్ట్ అడిగి హత్యచేసి పరారైయ్యాడు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతుర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండ్రాయి గ్రామానికి ఇవ్వగా, ఆయన తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇవ్వమని అడగ్గా, మోటర్ సైకిల్ ఆపి ఎక్కించుకున్నాడు. అప్పటికే మంకి క్యాఫ్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని నిందితుడు బాణాపురం దాటి తరువాత వల్లబి పొలాల సమీపంలో మోటర్ సైకిల్ పై ఉన్నఆ వ్యక్తి వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి బైక్ తో పరారైనట్లుగా పలువురు స్థానికులు చెబుతున్నారు…

అయితే జమాల్ సాహెబ్ అక్కడిక్కడే చనిపోయాడు