భువనగిరి పట్టణ జీనియస్ పాఠషాలలో ట్రస్మా ఎన్నికలు ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు

రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జీనియస్ పాఠశాలలో ట్రస్మా తెలంగాణ రాష్ట్ర రికాగ్నాయిస్ మేనేజ్మెంట్ స్కూల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిధిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు హాజరయ్యారు.
ఎన్నికల అధికారిగా బండిరాజుల శంకర్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా అచ్చయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణం రాజు కోశాధికారిగా ప్రెసిడెన్సీ విద్యాసంస్థల చైర్మన్ తీగల జయలక్ష్మి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ ట్రస్మా ను బలోపేతం చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని అవసరమైతే ప్రభుత్వం తో కొట్లాడి ప్రయివేట్ స్కూల్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
అలాగే మాపై నమ్మకం తో నన్ను మమ్మల్ని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి మరియు రాష్ట్ర సహాయ అధ్యక్షుడు తాడూరి చంద్రయ్య కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.