రాయల్ పోస్ట్ ప్రతినిధి ములుగు.

బస్సు డిపో ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

కెసిఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలి బస్సు డిపో ఎటుర్నగరం లో ఏర్పాటు చేస్తానన్న సీతక్క వెంటనే ఉపసంహరించుకోవాలి అసెంబ్లీలో ఒక మాట బయటికి వచ్చి ఒక మాట రాజకీయ స్వార్థం కోసం ఎన్నికల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సీతక్క మానుకోవాలి ములుగు జిల్లా అయిన కూడా ఇంతవరకు బస్సు డిపో లేదు ములుగు మున్సిపాలిటీ బస్ డిపో ముంజల బిక్షపతి ఆధ్వర్యంలో ఉద్యమాల ద్వారా సాధించారు బస్సు డిపో తరలిస్తే ముంజల బిక్షపతి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ ప్రజా సేన జాతీయ వ్యవస్థాపక* **అధ్యక్షులు *బొమ్మకంటిరమేష్ వర్మ** **అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని బొమ్మ కంటి రమేష్ వర్మ డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ దేవా నాయక్ జిల్లా ఇంచార్జి దొంతి తిరుపతి రెడ్డి అలవాల సదానందం బొమ్మకంటి సుధాకర్ అశోక్ రవీందర్ దినకర్ సాంబయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.