తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభుత్వ పాఠశాలల పట్లప్రభుత్వ నిర్లక్ష్యం తగదు…

-కె.జంగయ్య టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

రాయల్ పోస్ట్ న్యూస్/ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయడం తగదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్ లో జరిగిన టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయితున్నప్పటికీ పాఠ్యపుస్తకాలు పూర్తిగా అందజేయలేదని, ఏకరూప దుస్తులు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులను వెంటనే నిర్వహించాలని అందుకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ‌‌. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

‌ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి ,జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య , ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, జిల్లా ఉపాధ్యక్షురాలు సంగు వనిత, జిల్లా కార్యదర్శులు డి. స్వామి , కె రాజగోపాల్ , పి మోహన్ రెడ్డి ,ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.వి. రమణారావు, ఆడిట్ సభ్యులు పి.గోపాలకృష్ణ , జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరు అనిల్ కుమార్, వివిధ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ‌.