రాయల్ పోస్ట్ న్యూస్/యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, రుస్తాపురం గ్రామం. సి. నెం.119 యందు గల మొత్తం భూమి విస్తీర్ణం ఎ.00-07 గుంటల మా సొంత పట్టా భూమి గలదు మా భూమికి వెనకాల నలుగురి రైతుల తరువాత ఉన్న కొండాపురం స్వామి ముందర ఉన్న మా భూమి హద్దు బందులు పెట్టి ఇతరులను భూమిని అమ్ముతున్నా రిజిస్ట్రేషన్ చేయుటకు సిద్ధపడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసిపి వినతి పత్రం ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ
మేము భూషి కిస్టమ్మ భర్త లేట్ లింగం తండ్రి లేట్ కొండాపురం వీరయ్య, నివాసం: ధర్మారం గ్రామం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా మరియు పల్లెర్ల యాదమ్మ భర్త నర్సింహ్మ, తండ్రి కొండాపురం వీరయ్య, నివాసం: ముత్తిరెడ్డిగూడెం గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా ,మేము ఇరువురం అక్కచెళ్ళెళ్ళం మా తల్లి దండ్రులకు మేము ఇరువురం మాత్రమే సంతానం. మా తల్లి దండ్రుల మరణాంతరం మా తండ్రి కీ.శే. కొండాపురం వీరయ్య గారి పేరున 38–ఇ సర్టిఫికేట్ కలిగి ఉన్న తుర్కపల్లి మండలం, రుస్తాపురం గ్రామం. స.నెం. 119 యందు గల మొత్తం భూమి విస్తీర్ణం: ఎ. 00-07 గుంటల భూమిలో మాకు చెరీ ఎ 0-03.5 గుంటల చేసిన భూమి పట్టా చేయబడినది. ఆనాటి నుండి ఇట్టి భూమిపై మేము కాస్తు కబ్జాలో యున్నాము. ఇదే 119 సర్వే నెంబర్ లో కొండాపురం స్వామి తండ్రి రాజయ్య కి కొంత భూమి కలిగి యున్నాడు. ఆయన భూమి మా భూమి కి వెనుకాల నలుగురు రైతుల తరువాత ఆయన భూమి యున్నది. కావాలని ఇతరులకు అమ్మకానికి ప్రయత్నిస్తూ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదేందని మేము అడగగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు నా జోలికి వస్తే మీ అంతు చూస్తా అని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు కావున ఇట్టి విషయంలో మేము డిసిపి గారికి ఫిర్యాదు చేశామని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు