తుంగభద్ర కాలువలోకి దూసుకెళ్లిన ఆటో..ముగ్గరి మృతి మరో ముగ్గురి గల్లంతు

బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి తాలూకా కొలగల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో తుంగభద్ర హెచ్‌ఎల్సీలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 11 మంది ఉన్నారు.ప్రయాణికుల్లో దుర్గమ్మ, లింగమ్మ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన పుష్పవతిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. గల్లంతైన వారిని ఉలిగమ్మ, రత్నమ్మ, లక్ష్మిగా గుర్తించారు. ఆటో డ్రైవర్‌ భీమాతో పాటు శిల్ప, హేమావతి, వీరమ్మ, మహేశ్‌ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు….