తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

హైద్రాబాద్/ఈ సంవత్సరం దసరా పండుగకు భారీగా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 5 న దసరా పండుగ జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 26 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్రకటించింది.అయితే.. సెప్టెంబర్ 25 ఆదివారం, అక్టోబర్ 9 ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం పునః ప్రారంభం కానున్నాయని విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. 9,10 తరగతి విద్యార్థులకు సెలవులు తగ్గించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో వారి కూడా మొత్తం 15 రోజుల సెలవులు వచ్చాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.