ఆస్ట్రేలియన్ పార్లమెంటు లో జరిగే బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత గారికి ఆహ్వానం

ఎమ్మెల్సీ కవిత గారికి ప్రతిష్టాత్మక ఆహ్వానం….!!

ఈ నెల 25న అస్ట్రేలియాలో FINACT అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త చేసి, బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎమ్మెల్సీ కవితక్క గారికి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది…

సెప్టెంబర్ 25 న ఆస్ట్రేలియాలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి ఆహ్వానం అందింది.ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు…

ఇందులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితక్క గారిని FINACT అధ్యక్షులు డా.శాంతిరెడ్డి ఆహ్వానించారు.

ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు…