మోటకొండూర్ PHC లో 24 ×7 వైద్య సేవలు

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి లకు విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కృతజ్ఞతలు

రాయల్ పోస్ట్ న్యూస్/ ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇక నుంచి ప్రతి నిత్యం 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 24×7 వైద్య సేవలు కలిపిస్తూ అదనపు హెచ్ ఆర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇద్దరు కంటీంజెంట్ వర్కర్లను ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ ( DSC ) ద్వారా ఇద్దరు స్టాఫ్ నర్సులు, జౌట్ సోర్సింగ్ ప్రాతిపదికన కంటీంజెంట్ వర్కర్ల నియామకం చేపడతారు.

◆ మంత్రులకు కృతజ్ఞతలు : విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కొవిడ్ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వర్చూసా కంపెనీ వారు యునెటైడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూ. కోటి వెచ్చించి 30 పడకల సామర్థ్యంతో నూతన భవనాన్ని నిర్మింపజేశాను. 24×7 వైద్య సేవలు అందించాలని ఇటీవలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. జిల్లా మంత్రి గౌ !! శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో సమస్యను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లాము. వెంటనే స్పందించిన ప్రభుత్వం మోటకొండూర్ PHC కి 24×7 వైద్య సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.