మట్టి పోసి.. నరకం చూపిస్తున్నారు

(సంగారెడ్డి : రాయల్ పోస్ట్ న్యూస్)
సంగారెడ్డి లోని ఎమ్ ఆర్ ఎఫ్ కాలనీ , సాయినగర్, మైత్రి నగర్, గాయత్రి నగర్ లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. 13 వార్డ్ లోని ఈ కాలనీ లకు మట్టి రోడ్లు దిక్కు. చినుకు పడితే ..బురద మయంగా మారే ఈ రోడ్లను స్థానిక కౌన్సిలర్ పట్టించుకున్న పాపాన పోవడం లేదంటున్నారు. వినాయక చవితి కి గుంతల రోడ్లను బాగుచేస్తున్నామని చెప్పి.. మోరానికి బదులు.. మట్టి పోసి చేతులు దులుపు కోవడం తో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లన్నీ బురద మాయంగా మారాయి. దీంతో అటుగా వెళ్తున్న కాలనీ ల వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు బురదలో జారిపడ్డారు. దీంతో రోడ్ల సమస్యలు పట్టించుకోక పోతే పోయారు.. కానీ మట్టి పోసి నడవ రాకుండా చేసారని కౌన్సిలర్ పై మండిపడుతున్నారు.ముఖ్యంగా కొత్త వెంచర్లకు అడ్డడిద్ధంగా అనుమతులు ఇస్తున్న మునిసిపల్ అధికారులు.. ఆతర్వాత ఇటుగా వచ్చిన పాపాన పోవడం లేదని మండిపడ్డారు. పోనీ ఓట్లు వేసి గెలిపించిన నాయకులనా పట్టించుకుంటారా అంటే.. నిధులు లేవని చేతులెతేస్తున్నారు ఆని ఆ కాలనీవాసులు అంటున్నారు…

మొరం బదులు మట్టి వేయడంతో బురద మాయంగా తయారైన రోడ్లు