జిల్లా పరిషత్ చైర్మన్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో అక్రమాలు
జోగిపేట్ రాయల్ పోస్ట్ 12 సెప్టెంబర్ ప్రతినిధి సంగారెడ్డి
డాకూర్ గ్రామంలో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో జరిగినటువంటి అక్రమాలను అరికట్టాలని, నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని డిమాండ్ చేస్తు నేడు(12-09-2022) సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమంలో సాహసం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముప్పారంప్రకాశం, పూజా రమేష్ గౌడ్ (సర్పంచ్ డాకూర్), నరేందర్ రెడ్డి (చైర్మన్ pacs అక్షాన్ పల్లి) మాజీ యంపిటీసి రమేష్ గౌడ్, సుమారు 200 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…. పేదలందరూ పక్కా భవనాలలో నివశించాలనే గొప్ప సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ల యొక్క నిర్మాణాలు, కేటాయింపులు స్థానిక నాయకుల యొక్క అవినీతి అక్రమాల ద్వారా, అధికారుల నిర్లక్ష్యం ద్వారా నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబుల్ బెడ్ రూమ్స్ దక్కక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం దెబ్బతిని, ముఖ్యమంత్రి లక్ష్యం నీరుగారి పోతుంది.
మరియు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి మంజుశ్రీ గారి స్వగ్రామం అందోల్ మండలం డాకూరు గ్రామంలో నిర్మించినటువంటి 104 డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో జరిగిన అవకతవకల వల్ల గ్రామంలో నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరిగి, గ్రామంలో పెద్ద గందరగోళం అలజడి మొదలయ్యింది. ఈ అక్రమాలపై గతంలోని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం వల్ల ఒకటికి రెండుసార్లు డాకూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూంల కేటాయింపులపై విచారణలు జరిపి నిజమైన అర్హుల లిస్టును ప్రకటించి కేటాయింపులు కూడా చేసి ఉన్నారు. ఈ కేటాయింపులలో కూడా అనర్వుల పేర్లు కొంతమందివి రావడం వల్ల తిరిగి ఫిర్యాదులు చేయడం చేత, భవనాల కేటాయింపు తాత్కాలికంగా ఆపివేసి మళ్లీ సరైన విచారణ జరిపిస్తామన్న అధికారులు నేటికీ ఈ డబల్ బెడ్ రూమ్స్ కేటాయింపులపై ఒక సరైన పరిష్కారం చూపించండం లేదు. ఫలితంగా ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొని చివరి ఇష్టానికి వారు డబల్ బెడ్ రూమ్ లను ఆక్రమించి కొంతమంది నివాసం ఉంటున్నారు.
కాబట్టి తక్షణమే ఈ డబుల్ బెడ్ రూమ్ ల యొక్క సమస్యను పరిష్కరించాలని గ్రీవెన్స్ లో ఉన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ తో కూడిన విజ్ఞప్తి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ తక్షణమే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గారిని ఆదేశించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నాయకుల హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమం విరమించడం జరిగినది.