“మునుగోడు” లో నిజాయితీ గల మొనగాడిని ఎన్ను కోవాలి

న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి పిలుపు
………………….

రాయల్ పోస్ట్ న్యూస్/ ఓటు ను అమ్ముకోకుండ నిజాయితి గా ఓటువేసి నిస్వార్థ పరుడైనా ఎమ్మెల్యేను శాసనసభకు పంపిoచాలి అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి పిలుపు నిచ్చారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదలచేశారు

ఎవరో ఒకరి కోసం ఓటు వేయకుండా మీ భవిష్యత్ కోసం ఓటు వేయాలి అని నేటి మీ ఓటు రేపటి తెలంగాణా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి అనే విషయాన్ని మరచిపోవద్దు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు

రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ప్రజల నిర్ణయం ఉండాలి అని పేర్కొన్నారు

డబ్బులు ఇవ్వనీ, మద్యం పంచనీ, కూలీ ఇచ్చి ప్రచార సభలు నిర్వహించనీ నిస్వార్థ నాయకుణ్ణి గుర్తించి గెలిపించాలి అని ..తెలంగాణా ప్రజానీకం యావత్తు మీ నిర్ణయం కోసం వేచిచూస్తుంది అని.. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మన ప్రజాస్వామ్యం లో ఓటుకు ఉన్న విలువని మునుగోడు ప్రజలు మరింతగా పెంచాలి అని పేర్కొన్నారు

పోటీలో ఉన్నా ప్రతి అభ్యర్థి తన గెలుపు కోసం మీ ఇంటి ముందుకి పాంప్లెట్ తో వస్తారు, మీకు ఇస్తారు క్షుణ్ణంగా పరిశీలించండి , ఏ మాత్రం మీకు అనుమానం ఉన్న వారి ముందు బాండ్ పేపర్ పెట్టండి దానిలో వారి ప్రతిజ్ఞ తీసుకోవాలి అని , మాట తప్పితే శిక్ష ఏంటో కూడ అందులో రాయాలి అని సూచించారు.

అభ్యర్థులు ప్రతి ఓటర్ ను కలుస్తారు ఎందుకంటే పదునైన ఓటు అనే ఆయుధం మీ దగ్గర ఉంది కాబట్టి , వాల్ పోస్టర్ ల , ఫ్లెక్సీ లా హంగామా చూసి మోసపోకుండా, రోడ్ షో లు , బహిరంగ సభలలో మాట్లాడే గారడి మాటలకి గాబరా లో తొందరపడి మరో సారి నియోజక వర్గాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దని కోరారు

అభ్యర్థి పుట్టింది ఏ కులంలో , ఏ మతం లో అని చూడకుండా , ఎంత గుణవంతుడు, మునుగోడు నీ అభివృద్ధిలో ముందుకు ఏ మేరకు తీసుకు వెళ్తాడో చూడాలి అని అన్నారు.

మునుగోడు ప్రజలను తన స్వంత కుటుంబ సభ్యులుగా భావుంచి వారి సమస్యలను తీర్చే నాయకుడిని గుర్తించి ఎన్నుకోవాలి అని ఆ ప్రకటనలో వెల్లడించారు

మునుగోడు మొత్తం లో నీతివoతమైన పరిపాలన, నిజమైన సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికే కట్టుబడి ఉన్న నాయకునికి మాత్రమె పట్టం కట్టాలి కోరారు

ఎమ్మెల్యేగా అవినీతిలేని, ఉచిత ప్రజాసేవలు అందిస్తాడు అని మీరు నమ్మే నాయకుణ్ణి మాత్రమె మునుగోడు ఎమ్మెల్యే గా గెలిపించి మీ హక్కులను పొందాలి అని వేడుకున్నారు

ఓటు వేయడం మన హక్కు మరియు బాధ్యత ప్రతీ ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి మునుగోడు ప్రజలకు పిలుపనిచ్చారు