పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరం కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ కొనియాడారు.మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డుకు చెందిన కౌడే సత్తయ్య కు ఒక లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ శ్రీ కౌడే మహేష్ కురుమ గారు అందజేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.ఆపదలో ఉన్న పేద వారికి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ వారికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.మేడ్చల్ నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి మల్లారెడ్డి తన వార్డులో ఏ సమస్య ఉన్నా మంత్రి దృష్టికి తీసుకెల్తే స్పందించిన పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.మంత్రి మల్లారెడ్డి సహకారంతో వార్డులో ఏ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మా రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్,మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కౌడే శ్రీశైలం,టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అత్వెల్లి సందీప్ గౌడ్,నాచారం మహేష్ యాదవ్, సాయి ముదిరాజ్,బాబు గౌడ్, కౌడే గోవర్ధన్. తదితరులు పాల్గొన్నారు.