రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని కంచల తండా గ్రామానికి చెందిన యువకులు యాదగిరిగుట్ట లోని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాసంలో టి.ఆర్.ఎస్.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్న యువత కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానిస్తున్న *ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి .
ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్, బీజేపీల నుండి యువత టీఆర్ఎస్ పార్టీలోకి 100 మందిపైగా యువకులు చేరారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం PACS చైర్మన్ గూదే బాల్ నరసింహ,బొమ్మలరామారం మండల టి.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు పొలాగని వెంకటేష్ గౌడ్, వైస్ ఎంపీపీ శోభ చంద్రమౌళి,PACS వైస్ చైర్మన్ ఏనుగు కొండల్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గణేష్, భువనగిరి AMC వైస్ చైర్మన్ సత్యనారాయణ, మండల ST సెల్ ధీరావత్ రాజన్ నాయక్, AMC డైరెక్టర్ ధీరావత్ లింగ నాయక్, సెక్రెటరీ జనరల్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ లు ఉపసర్పంచ్లు ఎంపీటీసీ లు PACS డైరెక్టర్లు నాయకులు.. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…