• జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని బలహీన పరుస్తున్న బిజెపి ప్రభుత్వం
  • పనికి తగ్గ వేతనం లేదు కనీస వేతనాలు అమలు చేయడం లేదు
    – బృందా కారత్
    మాజీ పార్లమెంటు సభ్యురాలు,
    సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలహీన పరుస్తుందని, కూలీల శ్రమను దోచుకుంటుందని మాజీ పార్లమెంటు సభ్యురాలు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించినారు. ఆదివారం భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం బృందా కారత్ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా 2005లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఉపాధి హామీ చట్టానికి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ, చట్టాన్ని బలహీన పరుస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. నేటికీ కూలీలకు పనికి తగ్గ వేతనం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కొలతల ఆధారంగా కూలివ్వడంతో వారు శ్రమ దోపిడి గురవుతున్నదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొలతలతో సంబంధం లేకుండా కనీస కూలి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలు ఆరోగ్యపరంగా సరైన పోషకమైన ఆహారం లేక అనేక జబ్బులకు గురవుతున్నారని పాలకులు వారి యొక్క ఆహారము, వైద్యము, ఉపాధి విషయాల్లో సరిగా పట్టించుకోవడంలేదని అన్నారు. ఒంటరి మహిళలకు ప్రభుత్వము తగిన బాధ్యత తీసుకోకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిలో గాయపడిన, చనిపోయిన వారికి ప్రభుత్వపరంగా ఎక్స్గ్రేషియా, నష్టపరిహారం ఇవ్వడం లేదని ఇప్పటికైనా పని ప్రదేశాల్లో గాయపడిన చనిపోయిన వారి ప్రభుత్వపరంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించినారు. గాయపడిన వారికి వైద్యంతో పాటు ఇంటిదగ్గర ఉన్న సందర్భంలో రోజు కూలి ఇవ్వాలని అన్నారు. పని ప్రదేశాల్లో మంచినీళ్లు, నీడ కోసం టెంట్, మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, పనిముట్లకు ప్రభుత్వము తక్షణమే నిధులు విడుదల చేసి పారా, గడ్డపార, తట్ట ఉపాధి కార్మికులకు ఇవ్వవలసిన ఇవ్వాలని డిమాండ్ చేసినారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు కూలీ రేట్లు పెంచి రోజు కూలీలు రూ. 600 ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మం పేరుతో బిజెపి అధర్మం పాటిస్తుందని దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్యన అనైక్యత సృష్టిస్తూ మత ఉన్మాదాన్ని కొనసాగిస్తూ తన పబ్బం గడుపుకుంటుందని స్వదేశీ నినాదం పేరుతో నిరంతరం విదేశీ విధానాన్ని అమలు చేస్తుందని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు బాగా తెగ బలిసారని, పేదలు మాత్రము ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని, నిత్యవసర ధరలు పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నదని సామాన్య మానవుడు కనీసం ఒక్క పూట తిండి తినే పరిస్థితి లేదని ఆకలి రాజ్యమేలుతుందని ఆవేదన వెలిబుచ్చారు. రానున్న కాలంలో ఉపాధి పరిరక్షణ కోసం, కనీస వేతలాల అమలు కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సంఘటితంగా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చినారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకురాలు టి. జ్యోతి , తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు , గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ , సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ , తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ , గ్రామ సర్పంచ్ ఏదునూరి ప్రేమలత, ఎంపిటిసి గునుగుంట్ల కల్పన, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల నాయకులు ఏదునూరి మల్లేశం , గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపెల్లి కుమార్ , అబ్దుల్లాపురం వెంకటేష్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జెల్లల్ల పెంటయ్య, పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, కొండాపురం యాదగిరి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, నాయకులు ఎదునూరి వెంకటేశం, కొండా అశోకు ,బిక్షపతి బాలయ్య, జిట్టా అంజిరెడ్డి, ఎల్లముల వెంకటేష్, నొముల జ్యోతి, బొల్లెపల్లి లీల, పద్మ మల్లమ్మ, బుచ్చమ్మ ,ఎల్లమ్మ, వెంకటేష్, బాలరాజు, భారతమ్మ ,రాజు, అర్చన, వాణి, ఊర్మిళ ,అంజమ్మ, సునీత, తదితరులు పాల్గొన్నారు.