రాయల్ పోస్ట్ ప్రతినిధి...
గంగామాత కు ప్రత్యేక పూజలు గంగా హారతి మరియువన దుర్గ భవాని మాత ఉత్సవ విగ్రహానికి కు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి*
ఏడుపాయల కు చేరుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి ఆలయ పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్, ఇఓ శ్రీనివాస్, అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడడమే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు సంభవించి చడంతో పాటు సింగూర్ ప్రాజెక్టు నుండి దిగువకు విడుదల చేసిన నీటితో నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయని ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా వన దుర్గ భవాని మాత చూసుకోవాలని మొక్కు కొన్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వెల్లడించారు.ఆదివారం నాడు ఏడుపాయలకు చేరుకొని మంజీరా ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా వన దుర్గ భవాని మాత ఆలయం ముందు నుండి ప్రవహిస్తున్న మంజీరా నది కి గంగాహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గంగా మాతకు సారే చీరె సమర్పించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం లో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాల మూలంగా ప్రాజెక్ట్ లోకి పెద్ద ఎత్తున వరద వస్తుందని దీంతో నీటిని దిగువకు వదిలారు అని వెల్లడించారు. సింగూర్ ప్రాజెక్టు ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద నీరు సింగూర్ ప్రాజెక్టు లోకి పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో ఇప్పటికే మూడు గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేయడం తో మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. దీంతో వనదుర్గ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున పొంగిపొర్లుతుంది అన్నారు, మండలం చుట్టూరా మంజీర పరివాహక ప్రాంతం అయినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు, అంతేకాకుండా అధికారులు పోలీసులు సైతం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది పరివాహక ప్రాంతం అయినందున పంట పొలాలు మునిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు, అయితే రైతులు, ప్రజలు మంజీర తీరం వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చెరువులు కుంటలు సైతం పొంగిపొర్లుతున్న అటువైపు వెళ్లా వద్దన్నారు. మరో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కలెక్టర్లను,సంబంధిత జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏడుపాయల వన దుర్గ భవాని మాత దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారని వారు మంజీరా నది వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

అనంతరం జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పించేందుకు విచ్చేయగ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని చూసి బోనం అండివ్వగ ఎమ్మెల్యే బొనమెత్తుకొని అమ్మవారికి సమర్పించారు.అనంతరం రాజగోపురం లో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా ఆలయ పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్ ఎమ్మెల్యే కు శాలువాతో సన్మానించారు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్న పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఏడుపాయల పాలక మండలి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సంజీవ రెడ్డి,ధర్మకర్తలు వెంకటేశం,భూషణం, యాదయ్య, పెంటయ్య, మనోహర్, నాయకులు సాయి రెడ్డి, శ్రీనివాస్ బాలరాజు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.