అధ్వానంగా మారిన ఫతేపూర్ ప్రధాన రహదారి రోడ్డు

రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్పల్లి: శంకరపల్లి నుండి వికారాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి ఫతేపూర్ సమీపం వద్ద గుంతల మయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ పలువురు వాహనదారులు నీటితో నిండిన గుంతలను అంచనా వేయక అదుపుతప్పి కింద పడిపోయి గాయాలపాలయ్యారు. ప్రతిరోజు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో చోటుచేసుకుంటున్న అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.