రాయల్ పోస్ట్ న్యూస్/ RRR రాయగిరి భాధితులకు అండగా ఉంటా- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రీజనల్ రింగ్ రోడ్డు RRR రాయగిరి భాధితులకు అండగా ఉంటామని సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారి తో సోమవారం చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు.ఈరోజు RRR భాధితులు ఎం.పీ గారిని భువనగిరి వివేరా హోటల్ లో కలిసిన సందర్భంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి కార్యదర్శి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్,పంజాల రామాంజనేయులు గౌడ్, మర్రి నర్సింహ్మ రెడ్డి, కౌన్సిలర్స్ కైరంకొండ వెంకటేష్, ఈరపాక నర్సింహా,పడిగెల ప్రదీప్ ,గోద రాహుల్ గౌడ్,భాధితులు పల్లెల్లో యాదగిరి, పసుపునూరి నాగభూషణం,యాదిరెడ్డి, బుచ్చిరెడ్డి, అవిశెట్టి పాండు, గడ్డమీది మల్లేష్,నాయిని పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.