తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ఏ ఇక్బాల్ డి సి సి బి మాజీ డైరెక్టర్ మోరిగాడి చంద్రశేఖర్,
రాయల్ పోస్ట్ న్యూస్ అలేర్/ శనివారం రోజున చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆలేరు పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ డి సి సి బి మాజీ డైరెక్టర్ మోరీ గాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో సాకలి ఐలమ్మ ఇచ్చిన పోరాట స్ఫూర్తి కలకాలం నిలుస్తుందని పేద కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన నిజాం సైన్యాని దేశముఖ దొరలను ఎదిరించి పోరాడిందని ,ఆమె చూపిన తెగువ ఈ సమాజం ఎన్నటికీ మర్చిపోలేదని అన్నారు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం నిర్వహించి 10 లక్షల ఎకరాలను భూమిని పేదలకు పంచడమే కాకుండా తరతరాల వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేసిందని అని అన్నారు సాయిధ పోవటం వల్లనే నిజాం భారత సైన్యాలకు తలవంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తద్వారా ఇక్కడి ప్రజలకు స్వాతంత్రాన్ని అందించింది అని తెలిపారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి ప్రమేయం లేని ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ సంస్థలు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటాన్ని రెండు మతాల మధ్య పోరాటంగా చిత్రీకరిస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్న కాలంలో కనీసం ఆ ఉద్యమానికి మద్దతు తెలపని వారు ఈరోజు తెలంగాణ సాయుధ పోవటం పేరు చెప్పుకొని ఫోజులు కొడుతున్నారని అన్నారు చాకలి ఐలమ్మ పోరాటం చేసిన విసునూరు రామచంద్రారెడ్డి ఇతర దేశ్ముఖ్ హిందువులు కాబట్టి సాయుధపడటం సఫలం అయితే ఆ దొరల చేతి నుండి భూమి పోతుందని వాళ్లకు మద్దతుగా నిలిచిన ఆర్ఎస్ఎస్ జన సంఘ శక్తులు ఆపోరాటం పేరు చెప్పుకొని ఇప్పుడు ఓట్లు దండుకొనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కమ్యూనిస్టు నాయకత్వం లో జరిగిన సాయుధ పోరాటాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దీని విద్యావంతులైన తెలంగాణ యువత ప్రజలు తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మోరీగాడి రమేష్ తాళ్లపల్లి గణేష్ ఘనగాని మల్లేష్ మోడీ గాడి అజయ్ వడ్డేమాన్ బాలరాజు భువనగిరి గణేష్ వడ్డిమాను విప్లవ్ అక్కల్దేవ్ భాస్కర్ ఘనగాని రాజు తదితరులు పాల్గొన్నారు