చిరుత దాడిలో లేగదూడ మృతి

రాయల్ పోస్ట్ ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 10) సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు రాత్రి చిరుత పులి దాడిలో లేగ దూడ మరణించింది భూతపిల్లి వెంకట అనే రైతు తన వ్యవసాయ చేనులో పశువులను కట్టి ఇంటికి వచ్చాడు, శనివారం ప్రొద్దున వెళ్లి చూసేసరికి, చిరుత దాడి చేసి దూడను చంపిందని తెలిపారు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.