ఆధ్యాత్మిక చింతన చేయుట ద్వారానే భగవంతునికి దగ్గరగా ఉంటాం ~

పాల్వంచ రాజయోగిని బ్రహ్మాకుమారి పద్మజ

రాయల్ పోస్ట్ ప్రతినిధి పాల్వంచ/
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో రాజయోగని పద్మజ గారు వినాయకుని మండపాలను దర్శించి ప్రతి ఏట
గణేశుని నవరాత్రులు నిర్వహిస్తూ ప్రజలకు భక్తి భావనలను ఆధ్యాత్మిక చింతనతో శక్తి పొందుటకు పాల్వంచ పట్టణంలో ఎంతో కృషి చేస్తున్న ఆత్మిక సోదరీ సోదరులను యువతి యువకులను రాజయోగిని బ్రహ్మాకుమారీ పద్మజ కలుసుకొని అభినందించారుశాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశం గొప్ప పుణ్య క్షేత్రం, ఆధ్యాత్మికతకు, నైతిక విలువలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినఇల్లు .ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి భక్తి ,భావనలు ఉంటాయి. భగవంతున్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయడమే నిజమైన భగవంతుని సేవలు అని ఆ భగవంతుడి ఆశీస్సులు మరియు
మన కర్మలు కూడా శ్రేష్ఠమైనవి ఉన్నపుడే ఈలాంటి గొప్ప సేవలు చేసే అవకాశం దొరుకుతోంది అని అందుకు భగవంతునికి ప్రతి నిత్యం మనం కృతజ్ఞతలు చెప్పాలని ఆమె కోరారు.

అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని బ్రహ్మా కుమారీస్ సంకల్ప సేవ చేస్తున్నారు రాజయోగిని పద్మజ తెలిపారు.