మునుగోడు బైపోల్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి…

హైదరాబాద్‌:-మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసినట్లు కాంగ్రెస్‌ అధిష్ఠానం వెల్లడించింది.

ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా తెరాస, భాజపా మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.