భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి …..

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపడతాయని
*ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి * అన్నారు…
ఉదయం భువనగిరి మండల పలు (పచ్చర్ల బోర్డు తండా,రెడ్డి నాయక్ తండ మరియు ,సురపల్లి) గ్రామాలలో *హెచ్ఎండిఏ ఎస్డిఎఫ్ నిధులతో అండర్ డ్రైనేజ్ పనులకు మరియు సిసి రోడ్ పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది…
గ్రామాలలో పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ కార్డుకలను అందజేశారు…
అలాగే
గ్రామాలలో ఇటీవలి కాలంలో మరణించిన వారి కుటుంబాలకు *పైళ్ళ ఫౌండేషన్* తరపున ఒక్కొక కుటుంబానికి 5000 రూపాయలను అందజేశారు…
పచ్చర్ల బోర్డు తండా గ్రామంలో 15 కుటుంబాలకు
ఆకుతోట బాయి తండ గ్రామంలో 34 కుటుంబాలకు
సూరపల్లి గ్రామంలో 42 కుటుంబాలకు*…
ఈ సందర్భంగా
*ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ* భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే చిన్న గ్రామాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు…
గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు గ్రామాలకు ఇన్ని లక్షల రూపాయలు కేటాయించలేదని,మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన సీఎం కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోనీ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు…