ప్రభుత్వ బడి ఆ..? నీటి గుండమా..?
రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల రెండు కూడా ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి. అయితే మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి స్కూల్ అంతా నీటితో నిండి గుండాన్ని తలపించింది. దీనితో పిల్లలు ఆ నీటిలో నుండే వెళ్లాల్సి వచ్చింది. ఇదే మాదిరిగా వర్షాలు నిత్యం పడుతూ ఉంటే గ్రౌండ్లో నీరు నిలిచి పిల్లలు అనేక రోగాల బారిన పడతారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దయచేసి గ్రామస్తులు పట్టించుకోని నీరు నిండిన ప్రదేశంలో మట్టిని పోసి ఆ గుంతలు పుడ్చాల్సిందిగా సమస్యను పరిష్కరించాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు.