ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి…

రాయల్ పోస్ట్ ప్రతినిధి/
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామంలోని బీసీ కాలనీలో విపరీతంగా పందులు పెరిగిపోయాయని, పందులు పెరిగిపోవడమే కాకుండా చెడిపోయిన ఆహార పదార్థాలను పందులకు ఆహారంగా ఇండ్ల పక్కన పోయడం వలన విపరీతమైన దుర్వాసనతో పాటు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంతేకాకుండా పిల్లలపై కూడా దాడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.