నిరుపేద కుటుంబానికి అండగా బీర్ల ఫౌండేషన్
గుండాల సెప్టెంబర్ 06(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి)
గుండాల మండల కేంద్రంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పల్లపు యాదమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం సహాయం చేసిన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య మరియు బీర్ల ఫౌండేషన్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈరసరపు యాదగిరి గౌడ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల గ్రామ శాఖ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి గుండాల మండలం బీసీ సెల్ అధ్యక్షులు సుదగాని రామచంద్రయ్య గౌడ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలికట్టి ప్రశాంత్ బిసిసెల్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క శివశంకర్, జిల్లా ఎన్ఎస్యుఐ కార్యదర్శి ఆవుల సాయి ప్రసాద్, పొడిశెట్టి వెంకన్న, పునపర్తి భాస్కర్, సిరాజ్, జిట్టి అంజయ్య, పల్లపు శీను, అనపర్తి మొగులయ్య ,మేకల మల్లేష్ శ్రీకాంత్ ,పండగ ఉపేందర్ ,పల్లపు రమేష్ ,పసుపు నరసింహ తదితరులు పాల్గొన్నారు.