గుర్తుతెలియని వృద్ధా మహిళ మృత దేహం లభ్యం……

రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రాంనగర్ చౌరస్తాలో బిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్న గుర్తు తెలియని వృధా మహిళ వయసు సుమారు 70 నుంచి 80 సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి గూడు లేని వృద్ధ మహిళ వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతూ గత మూడు రోజుల క్రితం చెట్ల పొదల నడుమ చనిపోయిందని గుర్తుపట్టలేని స్థితిలో కుళ్ళిపోయిందని సమాచారం తెలిసిన స్థానిక కౌన్సిలర్ పంగరెక్క స్వామి సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన విషయం స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి వృద్ధ మహిళ మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ ట్రాక్టర్లో మృతదేహాన్ని వేసి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.