ఐఐటి యాజమాన్యం నిర్లక్ష్యం వలె విద్యార్థుల ఆత్మహత్యలు
రాయల్ పోస్ట్ సెప్టెంబర్7 సంగారెడ్డి ప్రతినిధి
ఐఐటి విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి

నిర్లక్ష్యం వహిస్తున్న డిన్ పై చర్యలు తీసుకోవాలి

విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మానిక్
ఐఐటి హైదరాబాద్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలని, విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యం వహిస్తున్న డిన్ పై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని కులవ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు సంగారెడ్డిలో జరిగిన దలిత అంబెడ్కర్ సంఘాల సమావేశంలో అతిమెల మానిక్ మాట్లాడుతూ ఐఐటి హైదరాబాదులో గత రెండు వారాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం యాజమాన్యం ఒక నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు లో చదువుల కోసం రావడం అంటే ఎంతో భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని విద్యార్థులు వస్తారని కానీ ఆశలు నిరాశలు అవుతున్నాయని అన్నారు గత వారం 15 రోజుల కింద ఐఐటి హాస్టల్లోనే మంచానికి కఠిన తాడుకు ఉరేసుకోవడం అనుమానాలకు కలుగుతున్నాయని అన్నారు ఆ ఘటన మరువకముందే ఐఐటి బీటెక్ కెమికల్ చదువుతున్న రాజస్థాన్ కు చెందిన మెగాకాపూర్ అనే దళిత విద్యార్థి లాడ్జి పైనుంచి దుంకి ఆత్మహత్య చేసుకోవడం దారుణమని అన్నారు ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన తీసుకోవాలని విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు బాలరాజు, రవి,చరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు