అవినీతిలో నెంబర్వన్ గా నిలిచిపోతున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రాయల్ పోస్ట్ ప్రతినిధి: మెదక్ జిల్లా రామాయంపేట మంలంలోని
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు జయశంకర్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ TRS అవినీతి పరులు, అవినీతి పరులతో అభివృద్ధి కోసం సమావేశం. అభివృద్ధి పేరుతో TRS నాయకులు సిగ్గులేకుండా సమావేశం ఏర్పాటు బాగానే ఉంది కానీ. TRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏండ్లు కావస్తున్నా MLA పద్మ దేవేందర్ రెడ్డి. నియోజకవర్గంలో రామయంపేట్ మరియు నిజాంపేట్ మండలాలలో అభివృద్ధి శూన్యం ఆమె గెలిచినా ఏమి చేయలేని పరిస్థితి కమిషన్లకు కక్కుర్తి పడి పని చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే పద్మ. భర్త దేవేందర్ రెడ్డి. ప్రతిదానికి కమిషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనివలన ఎక్కడి పనులు అక్కడే పడికేసాయి. ఇప్పటికైనా సోయి తీసుకొచ్చుకొని టిఆర్ఎస్ నాయకుల్లారా మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారా మీకు వెళ్ళగలిగే దమ్మున్నదా అని ప్రశ్నిస్తున్నాను. 2 వ సారి గెలిచినంక ఇన్నెండ్లకు ఎన్నికలు ఓస్తున్నయని అభివృద్ధి అనే పేరుతో కార్యక్రమాలు పెడ్తున్నరు, కానీ ప్రజలు TRS ప్రభుత్వాన్ని, మిమ్మల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. MLA గారిని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అడుగుతుంది.
1). మీరు హామీ ఇచ్చి, తీర్మానం చేసిన రెవిన్యూ డివిజన్ మర్చిపోయారా
2) . ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రధాన రహదారుల విస్తరణ, లైటింగ్, అండర్ డ్రైనేజీ ఏమైంది.?
3) . పట్టణ అభివృద్ధి కి మీరు ఎన్ని నిధులు కేటాయించారు.?
4.) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు
విద్యార్థి, విద్యార్థిని లకు అందుబాటులో.
లోకల్ TRS నాయకులకు అభివృద్ధి మీద సోయి లేకపోయింది.
అభివృద్ధి మాటున అధికార పార్టీ నాయకులు అభివృద్ధి ఐనరు, కని ఊరంతా గట్లనే ఉంది.
ఎవరి కన్నా సందేహం ఉంటే ఊర్ల ఎవర్ని అడిగిన చెప్తరు.
రెవిన్యూ డివిజన్ ప్రకటన తోనే
అభివృద్ధి కి అవకాశం ఉంటది.
పట్టణ.ప్రజలందరూ, యువతీ, యువకులు అందరూ ఆలోచించండి. అని తెలిపారు.