ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న సినీ నటి దర్శక నిర్మాత మంచు లక్ష్మి………

రాయల్ పోస్ట్ ప్రతినిధి /భువనగిరి 5 / సెప్టెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న (పెగా సంస్థ) వారు దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధి సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పాఠశాలలలో స్మార్ట్ క్లాస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 50 పాఠశాలలను స్మార్ట్ క్లాసులుగా తీసుకోవడం జరిగిందని దేశం గర్వించదగ్గట్లుగా ఈ ప్రభుత్వం పాఠశాలను తయారు చేస్తుమని విద్యార్థుల తల్లిదండ్రులు , పిల్లలు మీ అందరి సహకారం మాకు కావాలని వచ్చే తరం పిల్లలు మంచి విద్య బోధన అందించాలన్నారు. సంవత్సరం తర్వాత ఇదే పాఠశాలకు మరోసారి వస్తానని ఆమె తెలిపారు. ముఖ్యంగా , ప్రత్యేకంగా ఇంగ్లీష్ బోధన కూడా స్మార్ట్ క్లాసులు , కంప్యూటర్ లాబ్లు కానీ విద్యార్థులకు ఏర్పాటు చేసి విద్యార్థులను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. శిల్పి శిలను దెబ్బలు కొట్టడంతోనే శిలా శిల్పం గా మారిందని చెప్పుకొచ్చారు. తాను కూడా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు దెబ్బలు కోడుతూనే నాకు విద్యా బుద్ధులు నేర్పించారని ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలిపారు. అలాగే భువనగిరి పట్టణంలోని స్థానిక వెన్నెల కళాశాలలో ఏర్పాటుచేసిన టీచర్స్ డే వారోత్సవాలలో పాల్గొన్నారు. కళాశాలలో మంచు లక్ష్మి ప్రసంగిస్తూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి మంచి పొజిషన్లో ఉండాలని కన్న తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని సూచించారు.