టిఆర్ఎస్ గ్రాఫ్ డౌన్! ఏడు నెలలు 25 సీట్లు తేడా. .1) అధినేతల అంచనాలతో తగ్గుతున్న కాన్ఫిడెన్స్ 2) వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు ఖాయమని ఫిబ్రవరిలో ప్రకటించిన సీఎం 3) 90 సీట్లు వస్తాయని జూలైలో చెప్పినా కేటీఆర్ 4). మొన్నటి సీఎల్పీ మీటింగ్ లో 72 నుండి 80 కి అంచనాల పుదింపు 5) మరో ఏడాదికి ఇంకెన్ని తగ్గుతాయని విశ్లేషకుల చర్చ 6). ఇంతకు ఆ పాతిక స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి? రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ హైదరాబాద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తనకే దక్కుతుందంటూ మూడు పార్టీల ధీమా వ్యక్తం చేశాయి కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని దక్షిణాదిలో ఆ ట్రిక్కు కొట్టబోతున్న ఏకైక సీఎం ఆయనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు గోల్కొండ కోటపై జెండా ఎగురవేయబోతున్న అమ్మని పవర్ లోకి వస్తుందని తామేనని కాషాయ పార్టీ ప్రకటించుకున్నది ఈ రెండు పార్టీలను బొంద పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవని తెలంగాణకు ఇచ్చిన పార్టీగా అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది మూడు పార్టీల అంచనాలు ఎలా ఉన్నా అధికార టీఆర్ఎస్ పార్టీ లెక్కలు మాత్రం రోజురోజుకు మారుతున్నాయి 7 నెలల వ్యవధిలో వచ్చిన తేడాకు కారణమేమిటి? ఆ మార్పు ఎవరికి లాభము చేకూరుతుందని చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1న వార్షికో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు తెలంగాణలో 95 నుంచి 105 సీట్లు మధ్య గెలవబోతున్నామని రాసి పెట్టుకోండి అని నేను చెపుతున్న మాట ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం ముందస్తు ఎన్నికల కు వెళ్లబోము అని సూటిగానే చెప్పారు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో మార్చ్ 21న మీడియా సమావేశంలో కూడా దీన్నే నొక్కి చెప్పారు అసెంబ్లీ స్థానాల్లో మూడు వేరు వేరు ప్రైవేటు సంస్థలతో సర్వే చేయిస్తే 29 చోట్ల గెలుస్తామని ఒకచోట మాత్రమే 0.3 తేడాతో ఓడిపోతామని వెల్లడించారు. జూలై 15న మంత్రి కేటీఆర్. ఆ తర్వాత జులై 15న మీడియా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ 90 సీట్ల కంటే ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామన్న ధీమాను వ్యక్తం చేశారు అప్పటికే రెండు ప్రైవేటు సంస్థల సర్వేల్లో వచ్చిన వివరాలను ఉటంకిస్తూ ఒకటి బిజెపికి చేయించగా మరొకటి కాంగ్రెస్ చేయించిందని కామెంట్ చేశారు ఈ రెండు సర్వేల్లో రిజల్ట్ లో తొలి స్థానము బిజెపి పార్టీ ఉందని ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందని గుర్తు చేశారు ఎట్టి పరిస్థితుల్లో 90 సీట్ల కంటే ఎక్కువ వస్తా అన్నావ్ గెలవబోతున్నామని స్పష్టం చేశారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై టిఆర్ఎస్ బలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కామెంట్లు ఇలా ఉండగా తాజాగా శాసనసభ పక్ష సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. టిఆర్ఎస్ ఎల్పి మీటింగులో ఏమన్నారు అంటే…..!. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత టిఆర్ఎస్కు చెందిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో అధినేత కేసిఆర్ శనివారం రాత్రి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో 72 నుండి 80 సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు ఈ విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలే మీడియాకు వివరించారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని పద్ధతి మార్చుకోనే మార్చుకొని వారికి ఇవ్వబోమని కూడా సంకేతాలు ఇచ్చారు ఏడు నెలల క్రితం ఫిబ్రవరి 1న మాక్సిమం గా 105 సీట్లు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఇప్పుడు సెప్టెంబర్ 3 మాత్రం అది 80 సీట్లకు తగ్గుటకు ఆ పార్టీ నేతల మధ్యనే చర్చకు దారితీస్తుంది పార్టీ బలహీన పడుతుందని గుసగుసలు మొదలయ్యాయి నిత్యం సర్వేలపై ఆధారపడి కెసిఆర్ తాజాగా 80 సీట్లకే కమిట్ అయ్యాడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గుబులుకు దారితీసింది ఏడు నెలల వ్యవధిలోని టీఆర్ఎస్ కోల్పోతున్న 25 సీట్లు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోతాయి అన్నది కీలకంగా మారింది 100 జాకీలు పెట్టి లేపిన కాంగ్రెస్ లేచే పరిస్థితి తెలంగాణలో లేదని టిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు బిజెపికి రాష్ట్రంలో అంత సీన్ లేదన్న కామెంట్లు కూడా ఆ పార్టీ నుంచే వెలుపడ్డాయి మునుగోడులో బిజెపి అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమని సీఎల్పీ సమావేశంలో స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఇంతకంటే లేనిలేదు నీ బిజెపికి అంత సీను లేదని కామెంట్ చేస్తూనే టిఆర్ఎస్కు తగ్గుతున్న 25 సీట్లు ఎటుపోతాయన్నది మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది లెక్కతప్పిన పాతిక సీట్లు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తున్న టిఆర్ఎస్ కోల్పోతుందని పార్టీ అధినేత మాటల ద్వారానే వ్యర్థమైనది గుసగుసలు మొదలయ్యాయి…… ( ఆ కొద్ది మంది ఎవరు…?ప్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అధ్యాయనం తరువాత సుమారు 40 మంది సిట్టింగ్లకు ఈసారి టిక్కెట్లు దక్కకపోవచ్చు అని చర్చ టిఆర్ఎస్ లో మొదలైంది అది చాలామంది ఎమ్మెల్యేలలో గుబులు రేకెత్తించింది ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సెట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని పార్టీ విధానము అదే పని కానీ కొంతమంది వారి పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు దీంతో ఆ పొద్దున మందిలో ఎవరెవరు ఉంటారని టెన్షన్ మొదలైంది ఒకవైపు టిక్కెట్టు వస్తాయో రావోనని ఆందోళన మరోవైపు గెలిచే సీట్లు సంఖ్యలో సుమారు పాతిక తగ్గిపోతాయా పోవడం ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు నిద్ర పట్టనివ్వడం లేదు ఏడు నెలల్లో పాతిక సీట్లు తగ్గిపోతే షెడ్యూల్ ప్రకారము మరో ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో నాటికి ఇంకెలాంటి నిరోత్సాహం వార్తలు వినవల్సి వస్తాయని అనుమానము వారిని వెంటాడుతుంది*)