ఘనంగా గురుపూజోత్సవ వేడుక.
రాయల్ పోస్ట్ ప్రతినిధి బొమ్మల రామారమ్ భువనగిరి/ యాదాద్రి భువనగిరి జిల్లా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నాయకుని తండాలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంఈఓ కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల ప్రతిభ మరియు పాఠశాల వాతావరణాన్ని చూసి కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు సభముఖంగా ప్రకటించారు.మౌలిక సదుపాయాల కల్పనలో ఆర్థిక సాయం చేస్తామని అన్నారు.ఈ సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా బొమ్మలరామారం తుర్కపల్లి కి చెందిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుధీర్ రెడ్డి, ఎంపీడీవో సరిత గారు రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్, కార్యదర్శి నరసింహ రావు పాల్గొన్నారు.