ఆర్ఆర్ఆర్ రీజినల్ రింగ్ రోడ్ మాకొద్దంటూ రోడ్డెక్కిన రైతులు…..

రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆర్ ఆర్ ఆర్. రీజినల్ రింగ్ రోడ్ మాకు వద్దంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా , నిరసన కార్యక్రమం చేపట్టిన రైతులు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చొచ్చుకుపోయిన రైతులు మా భూములు మాకే కావాలంటూ మెమోరడం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఇట్టి విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి గెజిట్ నోటీసు నందు రాయగిరి గ్రామ పరిధిలో మాకు సంబంధించిన 3 సర్వే నెంబర్లు 682 , 726 , 727 లో గెజిట్ నోటీసులో ఉన్నాయి. ఇట్టి సర్వే భూముల నందు గత 28 సంవత్సరాల నుండి సుమారు 75 కుటుంబాలు అంటే పరోక్షంగా సుమారు 500 కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్ ద్వారా సుమారు 240 ఎకరాల భూమిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇప్పటివరకు ఇండస్ట్రీ నడపడం వలన ప్రభుత్వానికి పనుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాము. మేము ఈ భూమిని కాపాడుకుంటూ మేము బ్రతుకుతూ ఇతరులకు జీవనోపాధి కల్పించు అదేవిధంగా మా పిల్లలు కూడా పై చదువులకు విదేశాలకు వెళ్లకుండా ఈ వ్యాపార పెరుగుదలకు పనిచేయుచున్నారు. రాయగిరి గ్రామ పరిధిలో భూసేకరణ విషయమై అలయిట్మెంట్ ఇంకా కొంచెం ముందుకు మార్చినచో వ్యవసాయ భూములు కలిగి ఉన్నవి. మేము ఇట్టి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఉన్నవి కావు. సుమారు 240 ఎకరాల భూమి కోల్పోతున్నాం అంటే మార్కెట్ వాల్యూ సుమారు 100 కోట్లు కాబట్టి మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అంచలంచలుగా మా ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. మా భూములు మాకే కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. మా వ్యాపారమునకు ఎలాంటి ఆటంకాలు కలిగిన ఇన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు బట్టు రామచంద్రయ్య , టి పి సి సి మాజీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్ , జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షులు పసుపు నూరి నాగభూషణం , రెండో వార్డు కౌన్సిలర్ పూర్ణచందర్ , నీరజ్ రాయ్ , అనిల్ , పాండు , రమేష్ జి మల్లేష్ , దాసరి శ్రీనివాస్ , హనుమంత్ రెడ్డి , రాయగిరి గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.