ఈనెల 13న జరుగు జిల్లా వర్క్ షాప్ ను జయప్రదం చేయండి
– కొండమడుగు నర్సింహ
రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ ఈ నెల 13న సుందరయ్య భవన్, భువనగిరిలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ ను జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఒక ప్రకటన ద్వారా తెలియజేసినారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటుంటె బిజెపి ప్రభుత్వం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు తగ్గిస్తూ అనేక రకాలైన జీవోలను తెస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి గ్రామీణ పేదలు రాకుండా చేస్తున్నదని, పెరుగుతున్న ధరల కనుగుణంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం పెంచకుండా, చేసిన కూలీలకు వారం వారం డబ్బులు చెల్లించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నదని దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలు అనేక అవస్థలు పడుతున్నారని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. ప్రధానంగా ఈ వర్క్ షాప్ లో జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణ కోసం తీసుకోబోయే ఉద్యమాన్ని గురించి, పట్టణ ప్రాంతాలకు విస్తరణ గురించి, రోజు కూలీ 600 రూపాయల గురించి, సంవత్సరానికి 200 రోజుల పని దినాల గురించి గురించి, ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చర్చించి కర్తవ్యాలను రూపొందిస్తామని, ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జహంగీర్ పాల్గొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం అంత పాల్గొని ఈ వర్క్ షాప్ చేయవలసిందిగా నర్సింహ తెలియజేసినారు.