విశ్వ ఆత్మబంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రకృతిని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలి

మట్టి వినాయకున్నే పూజిద్దాం~ప్రమాద కమైన వాటిని దూరం చేద్దాం….

పాల్వంచ బ్రహ్మాకుమారి పద్మజ పిలుపు

భద్రాద్రి జిల్లా పాల్వంచ రాజయోగ మెడిటేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రహ్మాకుమారి పద్మజ మాట్లాడుతూ

విశ్వ ఆత్మలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

ప్రతి పండుగను అందరం ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది

వినాయక చవితి పండుగ మాత్రం చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వయస్సు వరకు
ఎంతో ఉత్సవంగా జరుపుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకొని పూజలు చేసుకునే విధానంలో కొన్ని మార్పుల వల్ల ప్రకృతికి,మానవులకు ఎలాంటి నష్టం జరగదు అని ఆమె తెలిపారు

దాని కోసం

తప్పని సరిగా మట్టి వినాయక విగ్రహంను పూజించాలి

ఇండ్లల్లోను పసుపుతోను
బియ్యపు పిండితో చేసిన వాటిని కూడా తయారు చేసుకొని పూజలు చేసుకోవచ్చు అని ఆమె అన్నారు

ఇలా చేయడం వల్ల ప్రకృతిని కాపాడటమే కాదు సృష్టిని రక్షించి సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతమని పద్మజ తెలిపారు

ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి

వినాయక చవితి పండుగ వచ్చింది అంటే యువకులు విద్యార్థులు ఎంతో హాడవుడి చేస్తుంటారు… తొందరపడి
పొరపాట్లు చెయ్యొద్దని కొంచం అజాగ్రత్తగా ఉండటం వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్న సంగతి ప్రతి సంవత్సరం చూస్తున్నాము

మండపాలు నిర్మించిన దగ్గర నుండి నిమిజ్జనం చేసే వరకు విద్యుత్ తో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు

పండుగలు అంటే సంతోషాన్ని మిగాల్చాలి కానీ విషాదాన్ని కాదు అని విధుల్లో పెట్టుకునే వాళ్ళు కూడా చుట్టూ ఉన్న కుటుంబాలను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సౌండ్స్ పొల్యూషన్ లేకుండా ఉంటే మంచిదని అవగాహన కల్పించారు

మెడిటేషన్ తోనే సాధ్యం

ఈ బిజీ లైఫ్ లో ఈజీగా సమస్యలు ఎలా అధిగమించాలి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దాని కోసం మెడిటేషన్ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందుటవల్ల సాధ్యం అవుతుంది అని ఆమె తెలిపారు
కె. స్. పి.. రోడ్ నందు గల రాజయోగ మెడిటేషన్ సెంటర్కు వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చు అన్నారు కావాల్సిన వారు 9246777886 కు సంప్రదించండి… అని తెలిపారు