రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా.. ……..భువనగిరి పట్టణంలోని బ్రాహ్మణ వాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తరగతి గదులు, మరియు ఉపాధ్యాయులను వెంటనే కేటాయించాలని విద్యా ఉద్యమ కమిటీ జిల్లా సెక్రటరీ కొడారి వెంకటేష్, పాఠశాల కో-ఆప్షన్ సభ్యులు కాచరాజు జయప్రకాష్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా కో- ఆప్షన్ సభ్యులు కాచరాజు జయప్రకాష్ మాట్లాడుతూ బ్రాహ్మణవాడ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం సుమారు 100 మంది కి పైగా విద్యార్థులను చేర్పించిన ఉపాధ్యాయులు అభినందనీయులని ఆయన అన్నారు. కానీ విద్యార్థులకు కూర్చోవడానికి తరగతి గదులు సరిపోవడం లేదని, బోధించే ఉపాధ్యాయులు లేరని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ను ప్రాథమిక పాఠశాల కు కేటాయించి, విద్యా శాఖ కార్యాలయం ను కలెక్టరేట్ లోనికి మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, పాఠశాలలో స్కావేంజర్ ని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా ఉద్యమ కమిటీ జిల్లా సెక్రటరీ కొడారి వెంకటేష్, సభ్యులు మాటూరి ఆంజనేయులు, రావుల రాజు,చిన్నం రవీందర్, జయశ్రీ పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాలకు వెంటనే గదులు, ఉపాధ్యాయులను కేటాయించాలి__ విద్యా ఉద్యమ కమిటీ.