ప్రత్తి రైతు సోదరులకు ఆగాహన కల్పించిన AEO :-

రాయల్ పోస్ట్ ప్రతినిది హత్నూర :-

కసాల గ్రామ ప్రత్తి పంట రైతు సోదరులకు అవాగాహన కల్పిస్తున్న AEO ప్రేమ్ రాజ్ , ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ప్రత్తి పంట ఆశించినంత ఎత్తుకు ఎదగకుండా ఎత్తు తక్కువలో ఉన్నది. పంట కాలం కూడా 40 నుండి 50 రోజుల మధ్యలో ఉన్నది. ఇప్పుడు వర్షాలు తగ్గాయి కాబట్టి, రైతులు భూమిలో వేసే ఎరువులు ఎక్కువగా వేసి పైరు పెంచాటానికి కృషి చేసే పనిలో ఉండవచ్చు. ఈ దశలో 1 ఎకరానికి 50 కిలోలు అమ్మోనియం సల్ఫేట్ లేదా 25 కిలోలు యూరియా + 25 కిలోలు పోటాష్ వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులు – DAP లేదా 20:20:00:13 లేదా 14:35:14 లేదా 10:26:26 వంటి ఎరువులను వేయటం వలన ఆ ఎరువులలో ఉండే భాస్వరం మొక్కకు అందుబాటులో కి రాదు. తద్వారా ఈ ఎరువులపై పెట్టే ఖర్చు ఎక్కువగా వృధా అవుతుంది. ఈదశలో నీటిలో కరిగి స్ప్రే చేయతగిన ఎరువులను వారం లేదా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు 1 ఎకరానికి 1 కిలో 19:19:19 + 350 గ్రాములు స్వర్ణఫల్ ఫోలియార్ ( ఫార్ములా 4) 100 లీటర్ల నీళ్లలో కలిపి స్ప్రే చేయండి. మళ్ళీ వారం తరువాత 1 kg 28:28:00( Sponta ) + 200 గ్రాములు 12 % జింక్ స్ప్రే చేయండి. మళ్ళీ వారం తరువాత 1 kg 12:61:00 + 400 ml మాక్సీల్డ్ ( ఫార్ములా 6) స్ప్రే చేయండి. మళ్ళీ వారం తరువాత 1 kg 00:52:34 + 1 kg మెగ్నీసియం కలిపి స్ప్రే చేయండి. మళ్ళీ వారం తరువాత 1.5 kg 13:00:45 + 200 గ్రాములు బోరాన్ కలిపి స్ప్రే చేయండి. మళ్ళీ వారం తరువాత 1.5 kg కాల్షియమ్ నైట్రేట్ + 150 ml విజయం ప్లస్ ( ఫార్ములా 5 ) కలిపి స్ప్రే చేయండి. ఇలా చేసినందువలన పైరు బాగా ఎదిగి మంచి పూత, కాత వచ్చి, పంట నాణ్యత, దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మీరు భూమిలో వేయాలనుకున్న ఎరువులను స్ప్రే రూపంలో ఆకులద్వారా ఇస్తున్నారు అంతే!!!. ఇలా చేస్తే మీకు ఖర్చు తక్కువ లో ఎక్కువ ఫలితం ఉంటుంది అని గమనించగలరు. పైన సూచించిన నీటిలో కరిగే ఎరువులను అన్నిరకాల పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చు. సమగ్ర పోషకాలు పైరుకు ఇవ్వటం ద్వారా పైరు ఆరోగ్యం గా ఉండి, పురుగులు, తెగుళ్ల తాకిడిని తట్టుకుంటుంది. తద్వారా పురుగు మందులు లేదా తెగుళ్ల మందులమీద పెట్టే ఖర్చు కూడా కొంతవరకు తగ్గించాకోవచ్చు. ప్రత్తి పొలంలో వచ్చే పురుగులు, తెగుళ్ల ఉధృతి బట్టి మందులను స్ప్రే చేయగలరు. అవాసరం అయితే నా నంబర్ 9505151043 కి ఫోన్ చేసి సహాయం తీసుకోగలరు అని AEO ప్రేమ్ రాజ్ సార్,చెప్పడం జరిగింది ,రైతు షేక్ షకీల్,ఎండీ మిహాజ్ అలి ,ఎండీ అఖిల్,ఎండీ మహేబుబ్,బుచ్చయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.