(సంగారెడ్డి రాయల్ పోస్ట్ ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.. జిల్లా యస్.పి. యం. రమణ కుమార్
 92 .98% హాజరు శాతం నమోదు.
 అన్ని పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా యస్.పి.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయించడంతో పాటు, స్వయంగా యస్.పి. పర్యవేక్షించారు సంగారెడ్డి జిల్లా లో మొత్తం 43 పరీక్షా కేంద్రాలలో 18,451 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 17,157 మంది పరీక్షకు హాజరుకాగా, 1294 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పరీక్షా కేంద్రాలు పటాన్ చేరు సబ్-డివిజన్ లో 17 కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాలలో అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడం జరిగిందన్నారు. అక్కడక్కడా బయోమెట్రిక్ సమస్యలు తలెత్తగా పోలీసు సిబ్బంది వెంటనే పింగర్ ప్రింట్ విధానం ద్వారా పరిస్కరించడం జరిగిందన్నారు.
ఈ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సమయంలో యస్.పి. తో సంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి జహీరాబాద్ డి.యస్.పి. వి. రఘు ఉన్నారు.