సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందికి ₹ 31,000/- వేల రూపాయల జరిమానా

సిద్దిపేట రాయల్ పోస్ట్ న్యూస్/ సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ,, సిబ్బందితో గత 2, 3, & 4 రోజుల నుండి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 13 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారం సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమేష్ బాబు ముందు హాజరుపరచగా విచారణ చేసి 13 మందకి ₹ 31,000/-వేల రూపాయల జరిమాన విధించారు*

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.