బిజేపి ప్రభుత్వ రాజ్యాంగ బద్ధ సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకుంటాం

ఓయూ జేఏసీ టీఎస్ జేఏసి డిమాండ్

హైదరబాద్/ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన కేంద్ర ప్రభుత్వం -రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అనే అంశంపై ఓయు జెేఏసి టీఏస్ జేఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్, ఓయు జేఏసి అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయల అధ్యక్షత జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మొదలుకొని ఇంటెలిజెన్స్ బ్యూరో,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్,ఈడీ ,సీబీఐ,భారత ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది అనే అంశంపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలపై ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజకీయ పార్టీలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను వేధిస్తునదో ప్రభుత్వాలను కూల్చడం కోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదో యువత ఆలోచించాలి.దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాదో గమనించండి,ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అవినీతికి తావివ్వవని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మనిష్ సిసొడియా పైకి ఏవిధంగా ఈడీ సీబీఐలను ఉసిగొల్పింది బిహార్ లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవిధంగా తమ చేతుల్లో ఉన్నటువంటి ఈడీ సీబీఐలను ఉపయోగించుకుంటుందో ఆయా రాష్ట్రాలలో గవర్నర్లు బిజెపి కార్యకర్తల్లాగా పనిచేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ఎలా కూలుస్తునారో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను కూలదోసి తమయొక్క పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఏ విధంగా కేంద్రంలోని గుజరాత్ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారో వివరించడం జరిగిందిఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.మల్లు రవి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జేవి చలపతిరావు,సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్ గారు నరేష్ జాదవ్,ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ మెంబర్ ఇందిరాశోభన్,ఓయూ వ్యవస్థాపకులు అశోక్ యాదవ్ రవీందర్ నాయక్ హరీష్ గౌడ్, మహమ్మద్ గఫూర్ గారు ప్రజాసంఘాల నాయకులు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాల గారూ బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం నరేష్ ప్రజాపతి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్
డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ప్రజా సంఘాల జేఏసీ కంటే సాయన,పీడీఎస్యూ జూపాక శ్రీనివాస్,ఆంధ్రప్రదేశ్ ప్రజాసంఘాల జెఎసి చైర్మెన్ జెటి రామారావు,జెఎసి నాయకులు ఎర్రబెల్లి జగన్ బాను నాయక్ విద్యార్థి జెఎసి నాయకులు చిరంజీవి బెస్తా రాజశేఖర్ గౌడ్ సురేశ్ నాయక్ జితేంద్ర పటేల్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు హాజరు కావడం జరిగింది.