భువనగిరి.రాయల్ పోస్ట్ ప్రతినిధి: / రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి పి.డి యాక్ట్ కేసు నమోదు చేయాలి డిసిసి ప్రధాన కార్యదర్శి md.mazhar. పత్రికా ప్రకటన ద్వారా ఈ రోజు డిసిసి ప్రధాన కార్యదర్శి md.mazhar మాట్లాడుతూ రాజా సింగ్ ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ మహమ్మద్ ప్రవక్త పై చేసిన వాక్యాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లిం సమాజాన్ని కి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టరీత్యా పి.డి యాక్ట్ కేసు నమోదు చేయాలని ఇలాంటి వ్యక్తుల్ని దేశ బహిష్కరణ చేయాలని గత కొంతకాలంగా రాజాసింగ్ మత విద్వేష పూరిత చర్యలకు పాల్పడుతూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు మతసామరస్యానికి విఘాతం కల్పిస్తున్నారని బిజెపి నాయకత్వం పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ చేయాలని ఏదో షోకాజ్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని రాజాసింగ్ ప్రతిసారి ప్రజలను మత ప్రాతిపదికన చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుని పి.డి యాక్ట్ కేసు నమోదు చేసి బొక్కలో వేయాలని మొహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు క్షమించరాని నేరమని ఇప్పటి వరకు ఎన్నో సార్లు హైదరాబాద్ లో ఎన్నో అల్లర్లు సృష్టించాడని హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేసినా రాజా సింగ్ ని trs ప్రభుత్వం చూసీచూడనట్టు విడిచి పెడుతోందని వెంటనే అరెస్టు చేసి బెయిలు రాకుండా కఠిన సెక్షన్లు విధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే ఇలాంటి వారి వలన ఈ దేశానికి ప్రమాదమని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది