కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ టీఆరెస్ పార్టీ – ప్రీతం, దళిత కాంగ్రెస్ అధ్యక్షులు
హైదరబాద్ తేదీ – 24-08-2022 , రాయల్ పోస్ట్ ప్రతినిధి/ గాంధీ భవన్ లో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాదయక్షులు ఎం కోదండ రెడ్డి గారితో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు, మంత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారినధని స్వయానా కేంద్ర హోమ్ మినిస్టర్ మునుగోడు సభలో మాట్లాడినారు. కేసీఆర్ ప్రభుత్వం లక్షల కొద్ది అవినీతికి పాల్పడుతున్నారని మీ ధగ్గర ఆధారాలున్నప్పుడు ఈడీ, సిబిఐ చేత ఎంధుకు విచారణ జరుపుతలేరు. అంధులో మీ వాటా ఎంత.
డిల్లీ లిక్కర్ మాఫియాతో MLC కవితకు సంబంధాలు ఉన్నాయని బిజేపి ఎంపీలు ఆరోపించగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంఎల్ఏ లు వెళ్ళి ఆమెకు సంఘీభావం తెలిపినారు. ఆమె తప్పు చేయనప్పుడు లిక్కర్ మాఫియాతో ఎటువంటి సంబంధాలు లేనప్పుడు ఎంధుకు భయపడుతున్నారు. నిజంగా సంబంధాలు లేవని నిరూపించుకోవలంటే నీ MLC పదవికి రాజీనామా చేసి సిబిఐ దర్యాప్తు సంస్థకు స్వయానా లేక రాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమణిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారు.
టీఆరెస్ తెలంగాణ రౌడీ సమితి గా మారిందన్నారు ..బీజేపీ టీఆరెస్ అంతర్గత మిత్రుత్వం..కేసీఆర్ నాలుగు గోడల మధ్య అమిత్షా కాళ్ళు పట్టుకుంటే ఈడీ ,సీబీఐ దాడులు జరగవనుకుంటున్నాడు అని ప్రీతం ఆరోపించారు ..తెలంగాణ లో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది..లిక్కర్ స్కాం లో కవిత ని బయటపడేయడానికి చూస్తున్నారు. క్యాబినెట్ సమావేశాల మాదిరి మంత్రులు కవిత ఇంటికి తోడుంటా అని వెళ్లడం సిగ్గులేని తనం అని ప్రీతం అన్నారు.. తెలంగాణ అడపచులకు గుజరాత్ నుండి నాసి రకం చీరలు తెచ్చి బతుకమ్మ పండుగ పేరుతో అవినీతి కి పాల్పడ్డ ఘనత కేసీఆర్ ధే అని వారన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా పరిహారం ఇవ్వలేదు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ టీఆరెస్ తెలంగాణ ను నాశనం చేస్తున్నాయి.. శ్రీలంక అధ్యక్షుడు కి పట్టిన గతి తెలంగాణ లో కేసీఆర్ కి పడుతుంది..కవిత పై వస్తున్న ఆరోపణలకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రం లోకి రావాలి అని ప్రీతం డిమాండ్ చేశారు. మిరే ఈడీ, సీబీఐ కి లేఖ రాసి విచారణ చేసి మీ తప్పు లేదని నిరూపించుకోవాలి అని బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవడం ఓ డ్రామా అని .. వారు ఘాటుగా వ్యాకనించడం జరిగింధీ. కాంగ్రెస్ పార్టీ అందరిని దోషులుగా నెలబెట్టే రోజులు దగ్గర పడ్డాయి అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాదయక్షులు షాబాద్ దర్శన్ చేవేళ్ళ నియోజకవర్గం గారు, ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాదయక్షులు అడ్వకేట్ కొమ్ము విజయ్ గారు, రాష్ట్ర కన్వీనర్ దళిత రత్న దబ్బెట, రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.