రాయల్ పోస్ట్ న్యూస్/ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని dieo గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
పల్లగొర్ల మోదీరాందేవ్
భువనగిరి, కాలేజీలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ బోర్డ్ హరిత మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారు పై తరగతుల కోసం వెళ్లేవారికి సర్టిఫికెట్ ఇవ్వకుండా మానసికంగా గురిచేస్తున్నారు మూడు రోజుల క్రితం ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్ ఇవ్వనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ప్రైవేటు యాజమాన్యం ఎక్కడికక్కడ విద్యార్థులను దోపిడీకి గురి చేస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రైవేట్ కళాశాలల దోపిడీ వల్ల సుమారు 20 వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్ విద్యార్థులకు ఇవ్వాలన్న గాని ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం విద్యార్థులను అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదే విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తే అలాంటి కాలేజీలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో ఇర్ఫాన్, రాజేష్, సంతోష్ నాయక్, నవీన్ గౌడ్, వినయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు