రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి/ 2022-23 సం,,లో భారత ప్రభుత్వము నిర్వహించు అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ సెలక్షన్ ట్రయల్స్ ఈ క్రింద చూపబడిన వివిధ క్రీడ అంశములలో 23-08-2022 వ తేదిన జిల్లా స్థాయి ఎంపికలు జరుగును.1.అథ్లెటిక్స్ 2.బాడ్మింటన్ ౩. బాస్కెట్బాల్ 4.క్రికెట్(స్త్రీ&పు) 5.చెస్ 6.క్యారమ్స్ 7.ఫుట్ బాల్ 8. హాకీ (స్త్రీ&పు) 9. కబడ్డీ (స్త్రీ&పు) 10.లాన్ టెన్నిస్ 11. పవర్ లిఫ్టింగ్ 12.స్విమ్మింగ్ 13.టేబుల్ టెన్నీస్ 14.వాలిబాల్(స్త్రీ&పు) 15. వెయిట్ లిఫ్టింగ్ 16.Best physic 17.రెజ్లింగ్(స్త్రీ&పు)

కావున పైన చూపిన క్రీడల అంశములయందు ఆసక్తి కలిగిన వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేయుచున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉద్యోగులు (పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే) వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ మరియు ఇటివల తీసిన ఐడెంటిటీ కార్డు తో, తేది:23.08.2022 న జిల్లా స్థాయి ఎంపికలకు గాను జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయము, Room No. S4, 2nd Floor, Collectorate, భువనగిరి నందు ఉదయం గం. 11.00 లకు హాజరుకగలరు మరియు జిల్లా స్థాయి లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరుగు పోటిలకు అర్హులు. కావున ఆసక్తి కలిగిన క్రీడాకారులు తేది:23.08.2022 న జిల్లా స్థాయి ఎంపికలకు గాను జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయము, Room No. S4, 2nd Floor, Collectorate, భువనగిరి నందు ఉదయం గం. 11.00 లకు హాజరుకగలరు. అని తెల్పడమైనది. (కే.ధనంజనేయులు) జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యదాద్రి భువనగిరి జిల్లా అధికారులను సంప్రదించగలరు.