: మహేష్ ను సన్మాని ఉపాధ్యాయులు విద్యార్థులు

తల్లి జ్ఞాపకార్థం గా సేవలు చేస్తున్న మహేష్

రాయల్ పోస్ట్ న్యూస్/ తన తల్లి లక్ష్మి జ్ఞాపకార్థం ఉన్న ఊరుకు సేవ చేయాలని నిర్ణయించాడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నెమలి గ్రామానికి చెందిన పండగ మహేష్. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మరమ్మత్తుకు నడుం బిగించాడు. తరగతి గదులలో అవసరమయ్యే గ్రీన్ బోర్డులను, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాడు. స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను నవీకరించి, పాఠశాల పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చాడు. మహేష్ కు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాలలకు మహేష్ చేసిన సేవల పట్ల గ్రామస్తులు అభినందించారు.